Category Archive: Telugu

Apr 11 2013

ఉగాది శుభాకాంక్షలు

Ugaadi

అందరికీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతీ రోజూ తెలుగు చదువుదాం. తెలుగు చదివిద్దాం. పై ఫొటోలో ఉన్నవి ఈ రోజు చదవడానికి సిద్ధంగా ఉన్న పత్రికలు, పంచాంగం.

Apr 10 2013

తెలుగోడి నమ్మకం

[ ఇది యధార్ధ సంఘటన. కల్పితం కాదు. ] ఈ రోజు ఉదయం సుమారు అయిదు గంటల సమయం. సంజీవరెడ్డి నగర్ నుండి అమీర్‌పేట్ మీదుగా సైకిలు తొక్కుకుంటూ వెళుతున్నాను. వంటిపై నీలం, తెలుపు రంగులు కలిసిన జెర్సి, తలపై రెఫ్లెక్టివ్ హెల్మెట్, చేతికి పాడెడ్ గ్లవ్‌లు, కాలికి ట్రయినింగ్ బూట్లు, వెరసి విశ్వనాథ సత్యన్నారాయణగారి వ్యాకరణబద్ధమయిన వాక్యాలలా ఉంది నా సైకిలు తొక్కే వేషధారణ. విద్యుత్తు వాడకం తగ్గించే ప్రణాళికలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిగారికి …

Continue reading »

Aug 29 2012

తెలుగు

ఈ రోజు మాతృభాషాదినోత్సవము. ఈ సందర్భంగా నేను చిన్నప్పుడు విన్న ఒక లలితగీతంలోని చరణంనుండి ఒక చిన్ని వాక్యం. ఈ పాటను దూరదర్శన్-హైదరాబాదు వారి లలితసంగీతం కార్యక్రమంలో సుమారు పాతికేళ్ళ క్రితం విని వ్రాసుకొన్నాను. ఆ పాట ఇప్పటికీ గుర్తుండిపోయింది.     నా వికస హృదయ కమలాసనమున నీవే కొలువయితే నా వినుత జీవ పాత్రికలోన నీ ప్రేమ నింపితే పదములు నీవే ఇమ్ము నీవే పాడే సుస్వరమిమ్ము తెలుగు చదువుదాము. తెలుగులో మాట్లాడుదాము.

Apr 05 2012

డాక్టరు పెప్పరూ, జెమినీ పళ్ళపొడీ, ఉపమాలంకారమూ

అమెరికాలో కోక్ తరువాత నేను ఎక్కువగా ఇష్టపడేది డాక్టర్ పెప్పర్. సుమారు పదిహేనేళ్ళ క్రితం మొదటిసారి డాక్టర్ పెప్పర్ తాగినపుడు మనసెటో వెళ్ళిపోయింది. వేరేరకం వెళ్ళిపోవడం అనుకునేరు సుమా, అప్పటికే నాకు పెళ్ళయిపోయింది. నాలుకమీది చిల్డ్ డాక్టర్ పెప్పర్ బిందువులు చిన్నప్పటి పల్లెటూరి ఉదయాలను గుర్తు చేసాయి. ఎడమచేతిలో పళ్ళపొడిని వేసుకొని, కుడిచేతిలోని టూత్‌బ్రష్‌ని చల్లని నూతినీళ్ళలో ముంచి, దానికి నెమ్మదిగా పళ్ళపొడి అద్ది నోట్లొ పెట్టుకున్న ఫీలింగ్ కలిగింది డాక్టర్ పెప్పర్ నోట్లోకి వెళ్ళగానే. ఇప్పటికీ …

Continue reading »

Feb 11 2012

తోక కొమ్మచ్చి ఆడిన ముళ్ళపూడి అనూరాధ

ఈ వారం స్వాతి వారపత్రికలో ముళ్ళపూడి అనూరాధగారి తోక కొమ్మచ్చి ఒక అనుకోని ఆహ్లాదం (టెల్గూలో ప్లెజంట్ సర్ప్రయిజు అన్నమాట.) పూర్వీకుల ప్రస్తావనలు మెండుగా ఉన్న కోతికొమ్మచ్చిలో  అనువంశీకుల ప్రస్తావనలు అస్సలు లేవు – రమణగారి ఉద్దేశపూర్వకంగానేనేమో. అనూరాధగారు తెలుగు సరిగా రాదంటూనే తెలుగువారి కలికితురాయి రాతలని మళ్ళీ గుర్తుచేసారు. కోతులతోటలో తోకలెక్కువగా ఉండటంవల్ల కొన్ని పేరాలు మళ్ళీ మళ్ళీ చదివి సంబంధబాంధవ్యాలను  అర్ధంచేసుకోవలసి వచ్చింది. పునఃపఠనం ఆహ్లాదానందకారకం. మొదటి సంపాదన చెక్కుని ఎక్కువడబ్బులకి ఎక్స్ఛేంజీ తీసుకుందామనుకున్న …

Continue reading »

Oct 23 2011

నిరాహార కార్తీకమా?

అమ్ములపొదిలోని అస్త్రాలని ఒక్కటొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు మన దొరవారూ, ఆచార్యులవారూను. ఇక మిగిలింది నిరాహారాస్త్రమే. తెగేదాకా లాగకూడదని మనవాళ్ళకి కొంచెం ఆలస్యంగా తెలివయింది. ఆసరికే కార్మికులూ, రవాణా ఉద్యోగులూ, విద్యార్ధులూ, మిగతా ఉద్యోగులూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడం మొదలెట్టారు. మూడు రోజుల రైలు రోకో జ్ఞానోదయ ప్రసాదిని అయింది. మన పోలీసులయితే మనవాళ్ళే కదా అని కొంచెం మెత్తగానే ఉంటారు కానీ రైల్వే పోలీసులు బిగిస్తే మన కొవ్వు కరిగి కండ నలుగుతుంది. ఏసీ …

Continue reading »

Sep 10 2011

Sri Rama Rajyam Telugu Audio Review

గత వారం రోజులకు పైగా కారులో శ్రీ రామ రాజ్యం పాటలు వింటున్నాను. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే ఈ పాటల గురించి నా మాటల్లో: జగదానందకారకా: బాలు, శ్రేయాఘోషల్ పాడిన ఈ పాట శ్రీరాముని అయోధ్యాగమనాన్ని కళ్ళకు కట్టినట్ట్లు చూపిస్తుంది. ఈనాటి మన తెలుగు చిత్రాలలొ ‘కర్టెన్ రైజర్’ (డిస్నీ వారి లయన్ కింగ్ లో సర్కిల్ ఆఫ్ లైఫ్ వంటివి) పాటలు చాలా అరుదు. అలాంటి అరుదయిన ఈ పాట విన్నకొద్దీ మళ్ళీ …

Continue reading »

Jun 22 2011

శాలిని గారి పెళ్ళి కార్డు

శాలినిగారి పెళ్ళి కార్డు చూడముచ్చటగా ఉంది. నా చిన్నపట్నుంచీ చూసిన పర్సనల్ కార్డుల్లో ఇంత క్లుప్తంగా, హృద్యంగా విషయాన్ని చెప్పిన కార్డులు చాలా అరుదు. అచ్చ తెలుగులో ఇంత బాగా చెప్పిన కార్డులు లేనే లేవు. కవరు మీద ఒకపక్క సింపుల్‌గా “నా పెళ్ళి”. అవతలిపక్క చిన్నారి సీగానపెసూనాంబ. తన బ్యాక్‌గ్రౌండులో చల్లని చంద్రుడూ, చిన్ని పిల్ల మేఘం. అడుగుపక్క చిన్ని చిన్ని డోలూసన్నాయిల తోరణం. లోపలి కార్డు మీద ఎడమపక్క చిన్ని ఫ్లేప్ మీద సుముహూర్తం, …

Continue reading »

May 27 2011

బంగారు హీరోలు

మన్మధుడు సినిమాలో నాగార్జున తన చిన్నాన్న తనికెళ్ళ భరణి తో ఉక్రోషంగా “మరి ఆడాళ్ళ చీరల షాపుల్లో సేల్స్ కి మగాళ్ళు ఎందుకుంటారు?” అని అంటాడు. ఆ సన్నివేశంలో అది జోక్‌గా అనిపించినా నిజజీవితంలో అది ఒక యధార్ధం. మన తెలుగు హీరోలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. బంగారం షాపులకి, బంగారు ఆభరణాలకి ఇంకా బంగారు ఋణాలకి అడ్వర్టయిజ్ చేయడానికి మన తెలుగు హీరోలకి ఉన్న డిమాండు హీరోయిన్లకు లేకుండా పోయింది. నాగార్జున, వెంకటేష్, …

Continue reading »

May 04 2011

సీమలూ, టపాకాయలూ…

దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమన్నట్లుంది ఒకానొక తెలంగాణా జే. ఏ. సీ. వ్యవహారం (ఒకానొక అని ఎందుకన్నానంటే ప్రస్తుతం ఎవరు ఏ జే. ఏ. సీ. తరఫున మాట్లాడుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి.) సదరు జే. ఏ. సీ. వారు “సీమ టపాకాయ్” అన్న సినిమా టైటిల్లో సీమ అన్న పదం ఉంది కాబట్టి ఆ సినిమాను తెలంగాణాలో బహిష్కరిస్తామంటున్నారు. రతనాల సీమ రాయలసీమకు “సీమ” అనే పొడి వ్యవహారికం కేవలం ఈమధ్య ప్రాచుర్యం పొందింది. …

Continue reading »

Older posts «