ఎవర్ని గెలిపించి ఉండాలి?
తెలంగాణ ప్రాంతం లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎవర్ని గెలిపించి ఉండాలి? తెలంగాణ ఓటర్లు తెలివైన వాళ్ళని నా గట్టి నమ్మకం. వార్తాపత్రికలు వ్రాసింది నిజమయితే గనక ఈ ఎన్నికల్లో ఓటర్లకి బాగా కిట్టుబాటు అయింది. మళ్ళీ అలాంటి కిట్టుబాటు అయే అవకాశం రావాలంటే సాధారణంగా 2014 కే సాధ్యం. కానీ ఓటర్లు గనక టీ. ఆర్. ఎస్. ను గెలిపిస్తే మళ్ళీ ఎప్పుడో వాళ్ళ నాయకులకి కాలక్షేపం కావలిసినప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ కిట్టుబాటు అవుతుంది. కాబట్టి విజ్ఞులయిన ఓటర్లు మాత్రం టీ. ఆర్. ఎస్. ను గెలిపించి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం. మరో రెండు రోజుల్లో తెలుస్తుంది కదా చూద్దాం.