శ్రావణ శుక్రవారం
Friday, July 31st, 2009శ్రావణ శుక్రవారం ప్రొద్దున్నే ఇంట్లో పూజ జరిగింది. తలస్నానం చేసి, ఆఫీసుకి రెడీ అయిన తరువాత సుష్టుగా ప్రసాదాలు తిన్నాను. పులిహోర, క్షీరాన్నం మరియు గారెలు తిన్న తరువాత కారెక్కుతూండగా వివిధభారతి వారి పండగ ప్రసారాలు గుర్తుకి వచ్చాయి. రేడియోలో పండగ ప్రసారాల సంబరం తగ్గింది అనుకుంటూ రేడియో పాటలు వింటున్నాను. ఈలోగా రేడియో జాకీ శ్రావణ శుక్రవారం గురించి, లక్ష్మీ దేవి కటాక్షం గురించి ఊదరగొట్టేసాడు. జనసామాన్యంలో పెరిగిన భక్తికి ముగ్ధుడనై ఉండగా వాడు శ్రోతలందరికీ రిసెషన్ ఎఫెక్టు తగ్గాలని ప్రార్ధించాడు. అపుడర్ధమయింది - అసలు విషయం.